పుల్వామా దాడికి ‘స్మారకం’ అక్కర్లేదు: సీపీఎం

0
2

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొంది ఏడాది అయిన తరుణంలో ఈ ఘటన చుట్టూ మరోసారి రాజకీయాలు ముసురుకుంటున్నట్టు కనిస్తోంది. పుల్వామా దాడి నుంచి ఎక్కువ లబ్ధి పొందిందెవరంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం ఓ ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, తాజాగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మొహమ్మద్ సలీమ్‌ సైతం గొంతు కలిపారు. 40 మంది జవాన్ల మృతికి ఎలాంటి స్మారకం అవసరం లేదని అన్నారు. ఈ ఘటన జరక్కుండా నిరోధించలేకపోవడం మన అసమర్థత అవుతుందని, దేశ అసమర్థతను గుర్తుచేసే స్మారకం అవసరం లేదని ఆయన అన్నారు.

‘పుల్వామా మన అసమర్థను గుర్తుచేసే ఘటన. దానికి స్మారకం అవసరం లేదు. మనకు తెలియాల్సిందల్లా ఒక్కటే. 80 కిలోల ఆర్‌డీఎక్స్ అంతర్జాతీయ సరిహద్దులు దాటి అత్యంత కట్టుదిట్టమైన మిలట్రీ జోన్‌లోకి వచ్చి, పుల్వామాలా ఎలా పేలిందనేది తెలిసి తీరాలి’ అని సలీం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు, వారి మిత్రుల పట్ల తనకు సానుభూతి ఉందని, అయితే ఆ దాడిని ఆపడంలో చోటుచేసుకున్న వైఫల్యాన్నే ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు.

‘మన సైనికులను కాపాడుకులేకున్నాం. ఉన్నతాధికారులకు పట్టదు. ఆర్డీఎక్స్ మన సరిహద్దుల్లోకి వచ్చింది. అదెలా జరిగింది? మన సైనికులు ఎలా చనిపోయారన్న దానిపై ప్రభుత్వం బాధ్యలను గుర్తించాలి. దర్యాప్తుతో నిగ్గుతేల్చాలి’ అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here