ఆకట్టుకున్న విధ్యార్ధుల నాటక పోటీలు..

0
1

గన్ ఫౌండ్రీః నేటితరం విధ్యార్ధులకు పాఠశాల స్థాయిలోనే నాటక రంగంపై అవగాహన కలిగేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉన్నత పాఠశాల విధ్యార్ధుల నాటక పోటీలు రెండవ రోజు అయిన బుధవారం రవీంధ్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ… విధ్యార్ధులకు నాటక పోటీలు నిర్వహించడం వలన వారిలోని ప్రతిభ, ప్రావీణ్యం తెలుస్తుందన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. పోటీల్లో గెలుపొందిన విధ్యార్ధులకు ఈ నెల 26వ తేదీన బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్ధంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఒకరితో ఒకరు పోటీపడుతూ ప్రదర్శించిన నాటినలు రంజింప చేశాయి. ఆడపిల్లలను కాపాడుకుందాం, చదింవించుకుందాం, బంగారుతల్లి, చాకలి ఐలమ్మ, నాటి తరం-నేటి తరం అనే అంశాలపై విధ్యార్ధుల నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ ఆయాచిత్రం శ్రీధర్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్.సీ.ఈ.ఆర్.టీ డైరెక్టర్ బి.శేషుకుమారి, బీసీ కమీషన్ సీనియర్ సభ్యులు వకుళాభరణం కృష్ట్రమోహన్ రావు, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి లక్ష్మీతో పాటు పలు పాఠశాలలకు చెందిన విధ్యార్ధులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here