పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

0
2

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

Gold bond price fixed at Rs 3788 per gm, issue opens Monday - Sakshi

సోమవారం ఇష్యూ ప్రారంభం

గ్రాము ధర రూ.3,788

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 7వ తేదీన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019–20– సిరీస్‌ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్‌ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌ అప్లై చేసిన, డిజిటల్‌ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్‌ ఉంటుంది.

అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్‌ అందుబాటులో ఉంటుందన్నమాట.  భౌతికపరమైన పసిడి డిమాండ్‌ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది. వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీల విషయంలో ఈ పరిమాణం 20 కేజీలుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here