బీఐఎస్ ప్ర‌మాణాల‌తో.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

0
4

బీఐఎస్ ప్ర‌మాణాల‌తో.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

హైద‌రాబాద్‌: మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల‌ను త‌యారు చేసింది. ఆ జాకెట్ల‌ను కేంద్ర వినియోగ‌దారుల‌శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు. బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్లను.. మేక్ ఇన్ ఇండియా ప‌థ‌కంలో భాగంగా త‌యారు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్స్ (బీఐఎస్‌) ప్ర‌మాణాల‌కు అనుగుణంగా వీటిని రూపొందించిన‌ట్లు చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సుర‌క్షిత‌మైన‌వి, తేలికైన‌వ‌ని, 50 శాతం తక్కువ ధ‌ర‌కే వ‌స్తున్నాయ‌న్నారు. విదేశాల‌కు కూడా ఈ జాకెట్ల‌ను ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు చెప్పారు. అమెరికా, బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ దేశాల జాతీయ నాణ్య‌తా విధానాల త‌ర‌హాలో బీఐఎస్‌కు కూడా ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌న్నారు. లైట్ వెయిట్‌ జాకెట్లు మ‌న జ‌వాన్ల‌కు బాగా స‌రిపోతాయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here