భార్య ప్రియుడిని కోర్టుకు లాగి..

0
2

భార్య ప్రియుడిని కోర్టుకు లాగి..

– రూ.5.3 కోట్లు రాబట్టిన భర్త.. అమెరికాలో ఘటన

వాషింగ్టన్‌: తన కాపురంలో నిప్పులు పోసి తన భార్యను తనకు కాకుండా చేశాడన్న ఆరోపణలపై భార్య ప్రియుడిని కోర్టుకు లాగి రూ.5.3 కోట్లు రాబట్టాడో భర్త. అమెరికాలోని ఐదు రాష్ర్టాల్లో ఇప్పటికీ అమలులో ఉన్న ‘హోంట్రావెకర్‌ చట్టం’ ఆధారంగా కేసు వేసి విజయం సాధించాడు. ఎప్పుడూ ఆఫీస్‌లో పని అని చెబుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ కెవిన్‌ హోవార్డ్‌ అనే వ్యక్తి భార్య.. ఆయన నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును కోరింది. భార్య ప్రవర్తనపై కెవిన్‌కు అనుమానం రావడంతో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ను రంగంలోకి దించాడు. ఆమె తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది. దీంతో గ్రీన్‌విల్లేలోని కోర్టులో భార్య ప్రియుడిపై దావా వేశాడు. 12 ఏండ్ల తమ వైవాహిక జీవితం చెడిపోవడానికి తన భార్య ప్రియుడే కారణమని ఆరోపించాడు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. కెవిన్‌కు 7,50,000 అమెరికన్‌ డాలర్లు (రూ.5.3 కోట్ల్లు) పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. భాగస్వామి తప్పుడు చర్యల ద్వారా వైవాహిక జీవితం విచ్ఛినమైందని భావించే వారు 1800ల నాటి ‘హోంట్రావెకర్‌ చట్టం’ కింద పరిహారం కోరే వెసులుబాటు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here