* ‘యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం సులభం కాదు’-విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌

0
3

‘యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం సులభం కాదు’

‘యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం సులభం కాదు’

దిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంత సులభం కాదని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఇరు పక్షాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన విభేదాలను తొలగించేందుకు ఉభయ దేశాల వాణిజ్యశాఖ మంత్రులు కృషి చేస్తున్నారని తెలిపారు. దిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా ఎకనమిక్‌ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అతిత్వరలో వాణిజ్య ఒప్పందం కుదురబోతోందనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అమెరికా వాణిజ్య శాఖ మత్రి విల్బర్‌ రాస్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జైశంకర్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా క్లిష్టమైన చిక్కులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఇటీవల మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై విల్బర్‌ స్పందిస్తూ.. అటు అమెరికాగానీ ఇటు భారత ప్రభుత్వంగానీ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను రద్దు చేయడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here