సెలెక్ట్ డబుల్ ఫెస్టివల్స్-ట్రిపుల్ ఆఫర్స్

0
5

సెలెక్ట్ డబుల్ ఫెస్టివల్స్-ట్రిపుల్ ఆఫర్స్

హైదరాబాద్, అక్టోబర్ 4: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ సెలెక్ట్..దసరా, దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని డబుల్ ఫెస్టివల్స్ ట్రిపుల్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద ఆన్‌లైన్ కన్నా తక్కువ ధరల్లోనే మొబైల్‌ను సెలెక్ట్ అందిస్తున్నదని, ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ వై గురు తెలిపారు. ఈ ఆఫర్లలో భాగంగా ఈఎంఐ రూ.1కే స్మార్ట్‌ఫోన్ అందిస్తున్న సంస్థ..20 శాతం పేటీఎం క్యాష్‌బ్యాక్, 10 శాతం హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్, 5 శాతం ఎస్బీఐ క్యాష్‌బ్యాక్‌తో పాటు 60 శాతం వరకు స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్ కల్పిస్తున్నది. వీటితోపాటు వన్‌టైం స్క్రీన్ రిప్లెస్‌మెంట్ అందిస్తున్నది. అలాగే రూ. 1,199 విలువైన ఫీచర్ ఫోన్లపై రూ.999 విలువైన గిఫ్ట్, రూ.1,199కే డ్యూయల్ సిమ్ కెమెరా జోడిని అందిస్తున్నది. బ్రాండెడ్ మొబైల్ యాక్సెసరీస్‌పై 70 శాతం వరకు రాయితీని అందిస్తున్న సంస్థ..షియోమీ టీవీలపై కూడా ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నది. ఎక్సేంజ్ ఆఫర్‌లో భాగంగా తమ పాత ఫోన్‌పై రూ.10 వేల వరకు పొందవచ్చునని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here