సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ?

0
3

సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ?

సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ?

దిల్లీ: త్వరలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆ సన్నాహాల్లో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్‌ ఇటీవల సౌదీలో పర్యటించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సౌదీకి చెందిన అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ ఆరామ్‌కోపై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు చమురు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తి వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే రిలయన్స్‌ పెట్రో కెమికల్స్‌లో ఆరామ్‌కో వాటాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మోదీ పర్యటనపై వస్తున్న ఊహాగానాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా అక్కడ జరిగే ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లోనూ మోదీ పాల్గొనే అవకాకశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌లో 100బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here