* అనంతపురం జిల్లాలో భారీ వర్షం

0
4

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

Heavy Rain In Anantapur District - Sakshi

 అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి, గుత్తిలలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా తాడిపత్రిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇ‍ళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉప్పు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుత్తి- ఆదోని మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెరువుకు గండిపడటంతో పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతోంది. కంబదురు మండలం కొత్తపల్లి వద్ద వంతెన కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here