* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ జితేంద్ర కుమార్‌

0
3

ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ జితేంద్ర కుమార్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆదివారం రాత్రి దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరికి.. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ప్రొటోకాల్‌ డైరెక్టరు జి.సి.కిశోర్‌కుమార్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి

నవ్యాంధ్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన అనంతరం జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here