ఆస్పత్రి బెడ్‌ఫై రూ.కోటి వాచ్‌ ధరించిన పాండ్య

0
2

ఆస్పత్రి బెడ్‌ఫై రూ.కోటి వాచ్‌ ధరించిన పాండ్య

ముంబయి: అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు హార్దిక్‌ పాండ్య. బ్యాటు, బంతితో రాణించగల తన ఆల్‌రౌండ్‌ సామర్థ్యంతో జట్టుకు సమతూకం తీసుకొచ్చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే అతడి పనిభారాన్ని సెలక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు అన్ని సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాంటిది దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెన్ను దిగువ భాగంలో గాయమే ఇందుకు కారణం.

ఆసియా కప్‌ ఆడేటప్పుడే హార్దిక్‌ పాండ్య వెన్ను గాయంతో బాధపడ్డాడు. మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. విశ్రాంతి తీసుకొన్నాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌ ఆడాడు. ఐతే అతడికి వెన్నుగాయం మళ్లీ తిరగబెట్టింది. నొప్పి విషయం చెప్పడంతో బీసీసీఐ అతడిని బ్రిటన్‌కు పంపించి శస్త్రచికిత్స చేయింది. మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలంటే కనీసం 6 నెలల విశ్రాంతి అవసరం. అతడు త్వరగా కోలుకోవాలని సురేశ్‌ రైనా, మయాంక్‌ అగర్వాల్‌ సహా జట్టు సభ్యులు ఆశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here