* ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదు:లక్ష్మణ్‌

0
2

ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదు:లక్ష్మణ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తీరువల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఉద్యోగులను ఉన్న పళంగా తొలగిస్తామనడం సరికాదన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన కృషిని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగాలను వీడియో రూపంలో ప్రదర్శించారు.’ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారు’ అంటూ గతంలో కేసీఆర్‌ సమైక్య పాలకులను హెచ్చరించలేదా?అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here