మహారథంపై శ్రీవారి వైభవం

0
2

మహారథంపై శ్రీవారి వైభవం

తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారిబ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి మహారథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు.ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గోవింద నామస్మరణతో తిరుమాడ వీధుల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. ఉత్సవాల్లో గరుడ సేవ తర్వాత రథోత్సవానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. రథంపై అధిష్ఠించిన స్వామికి… అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు.

తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైనది. రథోత్సవానికి విశేష ఆధ్యాత్మిక వివరణ ఉంది. ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని కఠోపనిషత్తులో ఎంతో చక్కగా వివరించారు. ఆ వివరణలో ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గానిగా, ఇంద్రియాలని గుర్రాలుగా, విషయాలనే వీధులుగా అభివర్ణించారు. ఇలా శరీరాన్ని రథంతో పోల్చి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే వివేకాన్ని కల్పించారు. రథోత్సవంలో కలిగే తత్వ జ్ఞానమిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here