మూసీగేటును 48 గంటల్లో అమరుస్తాం

0
3

మూసీగేటును 48 గంటల్లో అమరుస్తాం

-9వ తేదీనాటికి డ్యాంకు పూర్తి మరమ్మతులు
-రైతాంగానికి మంత్రి జగదీశ్‌రెడ్డి భరోసా
-డ్యాం వద్ద నీటిపారుదల నిపుణులతో ప్రత్యేక సమీక్ష
-సీఎం ఆదేశాలతో సోలిపేటకు స్మితాసబర్వాల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ, సూర్యాపేట రూరల్‌ : వరద ఉధృతికి ఊడిపోయిన మూసీ ప్రాజెక్టు 5వ నంబర్‌ క్రస్ట్‌ గేటును 48 గంటల్లో అమరుస్తామని, ఈ నెల 9వ తేదీ నాటికి మూసీ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని, కుడి, ఎడమ కాల్వల కింద సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌, నీటి పారుదల ఇంజినీరింగ్‌ ఇన్‌చీఫ్‌ మురళీధర్‌రావు ఆదివారం హుటాహుటిన సూర్యాపేట జిల్లా సోలిపేట సమీపంలోని మూసీ డ్యాం వద్దకు చేరుకున్నారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. స్మితాసబర్వాల్‌, మురళీధర్‌రావుతోపాటు నీటిపారుదల ఇంజినీరింగ్‌ నిపుణులతో మంత్రి జగదీశ్‌రెడ్డి డ్యాం వద్ద ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నిపుణులు డ్యాం వివరాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 1991 ప్రాంతంలో మూసీ కోసమే అదనంగా ఐదుగేట్లను తయారుచేయించారని.. అప్పట్లో తిరుపతి సమీపంలో నిర్మిస్తున్న కల్యాణి డ్యాంకు వాటిని తరలించారని అధికారులు తెలిపారు. అక్కడ రెండింటిని వినియోగించుకోగా మూడుగేట్లు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ఉన్నతాధికారులు తిరుపతి నుంచి మూడు గేట్లను తెప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారని.. 48 గంటల్లో వాటిని అమరుస్తారని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. అంతేగాకుండా ఈ నెల 9 నాటికి మూసీ డ్యాం మరమ్మతులు పూర్తిచేసి, నీటి వృథాను అరికడతామని చెప్పారు.

musi-gate3

రైతులు ఆందోళన చెందవద్దు

మూసీ ఆయకట్టు పరిధిలోని రైతాంగం భయాందోళనలకు గురికావద్దని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్నిచర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారయంత్రాంగం చర్య లు చేపట్టిందన్నారు. అవసరమైతే ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించి మూసీ ప్రాజెక్టును నింపి కుడి,ఎడమ కాల్వల కింద ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరందిస్తామని చెప్పారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని, రైతులు, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగ య్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్లు డీ అమయ్‌కుమార్‌, గౌరవ్‌ఉప్పల్‌, తదితరులు ఉన్నారు.
musi-gate2

 

గ్రూవ్స్‌ సరిగా లేకనే..

ప్రాజెక్టు రెగ్యులేటరీ గేటుకు ఇరువైపులా ఉండాల్సిన గ్రూవ్స్‌ (గాడులు) దెబ్బతినడం వల్లే గేటు పక్కకు జరిగినట్టు అధికారులు అం చనా వేస్తున్నారు. గ్రూవ్‌ దెబ్బతిని వరద తాకిడి ఎక్కువై ఒత్తిడికి గేటు పక్కకు జరుగగా ఒక్కసారిగా ప్రాజెక్టులోని నీరు దిగువకు వెళ్లడంతో గేటు ఇనుపపట్టీలు ధ్వంసమైనట్టు తెలుస్తున్నది. దీంతో శనివారంతో పోల్చితే ఆదివారం దిగువకు వెళ్లే వరద ఉధృ తి పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగావెళ్లాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here