రోహిత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..

0
4

రోహిత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..

Sehwag Passes Verdict On Rohit As Test Opener - Sakshi

విశాఖ:  దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా దిగి డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన సందర్భంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మద్దతుగా నిలిచాడు. రోహిత్‌కు ఓపెనర్‌గా సక్సెస్‌ కావడానికి సమయం పడుతుందని, అతను వీరేంద్ర సెహ్వాగ్‌ తరహా బ్యాట్స్‌మన్‌ అంటూ కొనియాడాడు. ఇది రోహిత్‌కు మంచి బలాన్ని ఇచ్చినట్లు సఫారీలతో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో మెరిశాడు. ఫలితంగా ఓపెనర్‌గా దిగిన తొలి టెస్టులోనే వరుస రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు.

కాగా, రోహిత్‌ ప్రదర్శనపై సెహ్వాగ్‌ తాజాగా స్పందించాడు. తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో రోహిత్‌ను కొనియాడాతూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. ‘ ఇది రోహిత్‌కు అద్భుతమైన టెస్టు మ్యాచ్‌. టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా చేయాలన్న రోహిత్‌ కల నెరవేరింది. ఇక ముందు కూడా నీకు అంతా మంచి జరగాలి. ఇదొక భారత్‌ సాధించిన అతి గొప్ప విజయం. ఇందులో మాయంక్‌ అగర్వాల్‌, షమీ, అశ్విన్‌, పుజారాల ప్రాతినిథ్యం కూడా ఉంది’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here