వాహనాలు వెళ్తుండగానే కూలిన వంతెన

0
3

వాహనాలు వెళ్తుండగానే కూలిన వంతెన

జూనాగఢ్‌: గుజరాత్‌లోని జూనాగఢ్‌లో అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. కార్లు, ఇతర వాహనాలు రోడ్డుమీద ప్రయాణిస్తుండగానే ఒక్కసారిగా నేల కూలింది. దీంతో ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయి. సుమారు 60 అడుగుల ఎత్తున్న ఈ వంతెన కూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఓ కారు నదిలో పడే స్థితిలో ఉండగా అందులో ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడే ఉన్న స్థానికులు రక్షించే వీలు లేకపోవడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. జూనాగఢ్‌ సమీపంలోని మలంక గ్రామ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెన కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈఘటనలో గాయపడిన 14 మందిని సమీప ఆసుప్రతికి తరలించామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here