* సమ్మెపై మరోమారు సమీక్షించనున్న సీఎం కేసీఆర్‌

0
2

సమ్మెపై మరోమారు సమీక్షించనున్న కేసీఆర్‌

సమ్మెపై మరోమారు సమీక్షించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస చేపడుతున్న సమ్మె ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో మరోమారు భేటీ కానున్నారు. తాజా పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్‌లు, కొత్త సిబ్బంది నియామకం తదితర అంశాలపై మధ్యాహ్నం తర్వాత మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ మరోసారి సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీపై అధ్యయన వివరాలను రవాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ కమిటీ ముఖ్యమంత్రికి వివరించనుంది.

మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. మూడో రోజు కూడా సగానికిపైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా వారికి తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here